హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి 'మహారాజ' రీమేక్.. తమిళ సినీ చరిత్రలో తొలి రికార్డ్!

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి 'మహారాజ' రీమేక్.. తమిళ సినీ చరిత్రలో తొలి రికార్డ్!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన 'మహారాజ' ఇప్పుడు హాలీవుడ్‌ను కూడా షేక్ చేసేందుకు రెడీ అయింది.  2024లో విడుదలై తమిళ సినిమా చరిత్రలోనే ఓ కొత్త మైలురాయిని నెలకొల్పింది ఈ క్రైమ్ థ్రిల్లర్. ఇప్పుడు హాలీవుడ్ లో రీమేక్ కాబోతుంది . తమిళ సినీ చరిత్రలోనే ఒక రీజినల్ ఫిల్మ్  మొట్టమొదటి హాలీవుడ్ రీమేక్ కావడం ఇదే తొలిసారి.

ప్యాషన్ స్టూడియోస్'హిస్టారిక్ మైల్‌స్టోన్' అంటూ సోషల్ మీడియాలో ఘనంగా ప్రకటన చేసింది. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కథ చాలా వింతగా మొదలవుతుంది. ఒక సాధారణ బార్బర్ (విజయ్ సేతుపతి) పోలీస్ స్టేషన్‌కు వెళ్లి 'లక్ష్మి' అనే డస్ట్‌బిన్ దొంగిలించబడిందని ఫిర్యాదు చేస్తాడు. పోలీసులు నవ్వుతారు… కానీ ఆ చిన్న ఫిర్యాదు వెనుక ఉన్న చీకటి రహస్యాలు, ట్విస్టులు, రివెంజ్ స్టోరీ ప్రేక్షకులను షాక్ చేస్తాయి. అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా భయంకరమైన పాత్ర పోషించగా, సంచన నమిదాస్ (విజయ్ కూతురు)కు జాతీయ అవార్డు దక్కింది.

కేవలం 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్లు వసూలు చేసింది. చైనాలో మాత్రమే 91.65 కోట్లు సంపాదించి, ఆ దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ అంతర్జాతీయ విజయం హాలీవుడ్ ఏజెన్సీలను ఆకర్షించింది. నిర్మాత సుధన్ సుందరం చెప్పినట్టు, చైనా విజయం తర్వాతే వారు రీమేక్ హక్కుల కోసం సంప్రదించారు. . A-లిస్ట్ హీరోతో ప్రాజెక్ట్ సెటప్ చేస్తున్నారు. 

ALSO READ : త్రిష స్థానంలో నేనుంటే ఆలా చేయను..

వచ్చే ఏడాది షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది.సోషల్ మీడియాలో ఆస్కార్ విన్నర్ మాథ్యూ మెకానహే (Matthew McConaughey) ఈ పాత్ర పోషించనున్నట్టు సంచలన వార్తలు వస్తున్నాయి.  కానీ అధికారిక నిర్ధారణ రాలేదు. హిందీ రీమేక్ హక్కులు ఇప్పటికే ఆమిర్ ఖాన్ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు హాలీవుడ్ కూడా… తమిళ సినిమా గ్లోబల్ స్టేజ్‌పై ఎగురుతోంది.