కోలీవుడ్ దళపతి, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, స్టార్ హీరోయిన్ త్రిషల సీక్రెట్ బాండింగ్ ఇప్పుడు సౌత్ ఇండియాలోనే హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా వీరిద్దరి అనుబంధంపై నెట్టింట రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. అంతేకాదు, ఇటీవల లండన్ రేసింగ్ ట్రాక్ వద్ద వీరిద్దరూ జంటగా కెమెరాకు చిక్కడం పొలిటికల్, సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు సైతం విజయ్-త్రిషల సంబంధాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
లేటెస్ట్ గా లండన్‌లోని సిల్వర్‌స్టోన్‌లో జరిగిన 'లే మాన్స్' (Le Mans) కార్ రేసింగ్ ఈవెంట్లో అజిత్ కుమార్ రేసర్‌గా పాల్గొనగా.. ఆ రేస్‌ను వీక్షించేందుకు సీఎం విజయ్ అక్కడికి వెళ్లారు. అయితే అదే విఐపి గ్యాలరీలో విజయ్‌తో పాటు త్రిష కూడా కనిపించడం సంచలనంగా మారింది. రేసింగ్ వేడుకల్లో మెరూన్ లెదర్ జాకెట్‌లో త్రిష సందడి చేస్తుండగా, కెమెరా ఫ్రేమ్‌లో పడకుండా విజయ్ ముఖం చాటేసేందుకు ప్రయత్నించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. సీఎం హోదాలో ఉన్న విజయ్ వెంట త్రిష లండన్ టూర్ రావడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ హాట్ టాపిక్‌పై సీనియర్ నటి అంబిక ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్, త్రిషలు మంచి స్నేహితులు కావొచ్చు.. ఒకరు ఉన్నత పదవిలో ఉన్నంత మాత్రాన స్నేహాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు.. కానీ ప్రజా జీవితంలో ఉన్న ఒక ముఖ్యమైన వ్యక్తికి మన ప్రవర్తన వల్ల నెగెటివిటీ, విమర్శలు వస్తున్నాయని తెలిస్తే జాగ్రత్తగా ఉండాలి. నేను గనక త్రిష స్థానంలో ఉంటే, నా వల్ల నా స్నేహితుడి ప్రతిష్ట దెబ్బతింటుందని భావిస్తే విజయ్‌తో కలిసి అలా పర్యటనలకు వెళ్లకుండా దూరంగా ఉండేదాన్ని. పదే పదే అభిమానులు సమాధానం చెప్పుకోలేరు కదా అని స్పష్టం చేశారు.
విజయ్ సీఎం అయ్యాక కూడా వీరి రూమర్స్ తగ్గకపోవడంతో, అంబిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ప్రజాదరణ పొందిన నాయకుడిగా విజయ్ ఇమేజ్ కాపాడాల్సిన బాధ్యత త్రిషపై ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వరుస కాంట్రవర్సీలపై త్రిష ఎలా స్పందిస్తుందో చూడాలి..
Thalapathy Vijay didn't expected her entry ? He looks UNCOMFORTABLE right after the moment trisha entered the frame 👀#Thalapathy #Vijay #Ajithkumar #TVK pic.twitter.com/2lDJpW5hnP
— Gokul (@ItzGokulVJ) September 12, 2026
