ఇవాళ (నవంబర్ 01న ) ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ రైతు గర్జన.. హాజరు కానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఇవాళ (నవంబర్ 01న ) ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ రైతు గర్జన.. హాజరు కానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఆదిలాబాద్, వెలుగు :  ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం రైతు గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. కాగా, చాలా రోజుల తర్వాత జిల్లాలో బీఆర్ఎస్ సభను పార్టీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

‘చనాకా కోరట’ గురించి కవితకు తెలియదు..

జిల్లాలోని చనాకా కోరట ప్రాజెక్టు గురించి వాస్తవాలు తెలియకుండానే టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఇంద్రవెల్లి పాంచజన్య సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ లక్ష్యంగా చేసుకుని కవిత ఆరోపణలు చేయడాన్ని శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తప్పుబట్టారు. 2015లో జీవో 120 ప్రకారం రూ.1,220 కోట్లు మంజూరు చేశామన్నారు. 2025లో అది కాస్త రూ.1,590 కోట్లు అయిందన్నారు. తమ హయాంలో పూర్తి ప్రాజెక్టు రూ.1300 కోట్లు కూడా దాటలేదన్నారు. కానీ కవిత మాత్రం 17 వందల కోట్లు అవినీతి జరిగిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.