వెస్టిండీస్తో టీమిండియా సిరీస్.. రోహిత్, కోహ్లీ రీఎంట్రీ.. పంత్కు నిరాశ.. హార్థిక్కు తప్పని వెయిటింగ్..!

వెస్టిండీస్తో టీమిండియా సిరీస్.. రోహిత్, కోహ్లీ రీఎంట్రీ.. పంత్కు నిరాశ.. హార్థిక్కు తప్పని వెయిటింగ్..!

వెస్టిండీస్తో జరిగే ODI సిరీస్, T20 సిరీస్కు టీమిండియా జట్టును BCCI ప్రకటించింది. గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి,  రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసీద్ కృష్ణ, బ్రార్, సిరాజ్, అక్వీబ్ నబీ, యశస్వి జైశ్వాల్, నమన్ ధీర్ వన్డే సిరీస్ జట్టులో ఉన్నారు. రిషబ్ పంత్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్‌కు అవకాశం దక్కింది.

ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు పంత్ నాయకత్వం వహించనుండటం గమనార్హం. నమన్ ధీర్, అఖిబ్ నబీలను తొలిసారిగా వన్డే జట్టులోకి ఎంపిక చేశారు. వన్డే జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ మరోసారి తన స్థానాన్ని నిలబెట్టుకోగా, 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత దిగ్గజాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత జట్టులోకి తిరిగి వచ్చారు. హార్థిక్ పాండ్యాకు చోటు దక్కలేదు.

టీమిండియా తదుపరి సిరీస్ వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగనున్న సంగతి తెలిసిందే. 2026, సెప్టెంబర్ 27న తొలి ODI జరగనుంది. మూడు వన్డేలు జరగనున్నాయి. 2027 వన్డే ప్రపంచ కప్ కోసం భారత్ చేస్తున్న సన్నాహాల్లో ఈ సిరీస్ కీలకం కానుంది. ఈ వన్డే సిరీస్ తర్వాత, అక్టోబర్ 6 నుంచి 17 మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. అక్టోబర్ 14న నాలుగో టీ20 మ్యాచ్ హైదరాబాద్ సిటీలోనే జరగనుండటం విశేషం.

►ALSO READ | గంభీర్ ఆ ప్రయోగాలు ఆపేయ్: ఇలా చేస్తేనే 2027 వరల్డ్‌కప్ గెలుస్తాం.. యువీ బిగ్ అడ్వైజ్!

ఇక.. టీ20 జట్టు విషయానికొస్తే.. శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్ దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్తో కూడిన స్వ్కాడ్ను టీ20 సిరీస్కు బీసీసీఐ ఎంపిక చేసింది.