హైదరాబాద్లో మరో చిట్టీల మోసం.. రూ.3 కోట్లు వసూలు చేసి ఉడాయించిన దంపతులు

హైదరాబాద్లో మరో చిట్టీల మోసం.. రూ.3 కోట్లు వసూలు చేసి ఉడాయించిన దంపతులు

గ్రేటర్ హైదరాబాద్ లో మరో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుద్వేల్‌లో చిట్టీల పేరుతో మూడు కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించారు దంపతులు. నమ్మకంతో చిట్టీలేసిన బాధితులు కోట్ల రూపాయలు కోల్పోవడంతో లబోదిబోమంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే..  రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధి బుద్వేల్‌లో జరిగింది ఈ ఘటన. అశోక్‌ అనే వ్యక్తి గత కొంతకాలంగా స్థానికంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అశోక్ దగ్గర చిన్నచిన్న వ్యాపారులు , మహిళలు చిట్టీలు వేశారు. 

►ALSO READ | పక్కింటికి వెళ్లి వచ్చేలోపే.. మేడ్చల్ లోపట్టపగలే చోరీ.. 9తులాల బంగారంఎత్తుకెళ్లిన దొంగలు

కొన్నాళ్లు చిట్టీల వ్యాపారం బాగానే నిర్వహించి నమ్మకం పెచుకున్న అశోక్.. ఆ తర్వాత భారీ మొత్తం వచ్చాక తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాడు. పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఇంటికి తాళం వేసి పరారయ్యారు అశోక్ దంపతులు .

కష్టపడి సంపాదించిన డబ్బులు కోల్పోవడంతో అశోక్ ఇంటిముందు బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాల్సిందిగా లీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.