మారుతి ఆటోమేటిక్ ఎస్-సీఎన్జీ కార్లు వచ్చేశాయ్

మారుతి ఆటోమేటిక్ ఎస్-సీఎన్జీ కార్లు వచ్చేశాయ్

మారుతి సుజుకి తన ఆటో గ్రీన్ మిషన్ లో భాగంగా భారత్ లో తొలిసారిగా S-CNG ఆటోమేటిక్ వెర్షన్లను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్ డిజైర్,బాలెనో ,మోడళ్లలో ఈ 5-స్పీడ్ ఆటో గేర్ షిఫ్ట్ సాంకేతికతను జోడించింది. 

మారుతి సుజుకి తన పాపులర్​ మోడల్స్​ స్విఫ్ట్​, డిజైర్​, బాలెనో ఆటోమేటిక్​ ఎస్​-సీఎన్​జీ వెర్షన్లను శుక్రవారం విడుదల చేసింది. వీటిలో ఆటోమేటిక్  గేర్‌‌‌‌ షిఫ్ట్, క్లచ్​ లెస్​ టెక్నాలజీలను ప్రవేశపెట్టింది. స్విఫ్ట్ ఎక్స్​షోరూం ధర రూ. 7.29 లక్షలు కాగా, డిజైర్  ధర రూ. 8.53 లక్షలు ఉంటుంది.  

బాలెనో ఎక్స్​షోరూమ్​ రేటు రూ.8.32 లక్షలు. ఈ మూడింట్లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌‌‌‌ ఉంటుంది. కిలో సీఎన్​జీకి 35 కిలోమీటర్ల వరకు మైలేజ్ ​ఇస్తాయి. ఎస్​–సీఎన్​జీ టెక్నాలజీ వల్ల ఇంజన్​కు మరింత గాలి, గ్యాస్​ అందుతాయని, ఫలితంగా ఎక్కువ శక్తి, మైలేజ్​ పొందవచ్చని మారుతి తెలిపింది.