నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలి :ఏలేటి మహేశ్వర్రెడ్డి

నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలి :ఏలేటి మహేశ్వర్రెడ్డి
  • బీజేఎల్పీ నేత ఏలేటి డిమాండ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సాగునీళ్లందక పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్​రెడ్డి డిమాండ్​చేశారు. అధికారంలోకి వచ్చి 33 నెలలు దాటినా కాళేశ్వరం బ్యారేజీలకు ఎందుకు రిపేర్లు చేయలేదని, రైతు కూలీలకు రూ.12 వేలు ఎందుకు అందించడం లేదని, వ్యవసాయానికి ఆరు గంటల కరెంట్ కూడా సక్కగ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు.

రాష్ట్రంలో కరవు మండలాల, గ్రామాల వివరాలను వెంటనే అధికారింగా ప్రకటించాలని కోరారు.శుక్రవారం ఆయన అసెంబ్లీలో ఎల్ నినోపై జరిగిన స్వల్పకాలిక చర్చలో మాట్లాడారు. ఎల్​నినో అంశంపై ఎక్స్​పర్ట్స్​కమిటీ సూచనల ఆధారంగా కేటాయించిన రూ.802 కోట్ల కాంటింజెన్సీ నిధులను ప్రభుత్వం ఖర్చు చేసిందా? లేదా సభ్యులకు తెలియజేయాలని ఏలేటి డిమాండ్​చేశారు.