హైదరాబాద్, వెలుగు: విండ్ ఎనర్జీ సెక్టార్‌ను మరింత బలోపేతం చేయడానికి ఇండియన్ విండ్ టర్బైన్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐడబ్ల్యూటీఎంఏ), న్యూ, రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ (ఎంఎన్‌ఆర్‌ఈ) సహకారంతో విండర్జీ ఇండియా సదస్సును నిర్వహిస్తోంది. చెన్నై ట్రేడ్ సెంటర్‌లో ఇది అక్టోబర్ 7 నుంచి 9 వరకు జరగనుంది. ‘భారత్ ఇంధన స్థితిస్థాపకతకు శక్తి’ అనే ముఖ్యాంశంతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
2030 నాటికి 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. 2025-–26లో ఆరు గిగావాట్ల విండ్ ఎనర్జీ సామర్థ్యం కొత్తగా చేరింది. దీంతో 2026 ఆగస్టు 31 నాటికి దేశంలో మొత్తం ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ 58.52 గిగావాట్లకు పెరిగింది. పవన విద్యుత్ పరికరాల ఎగుమతులు రూ.12 వేల కోట్లను దాటాయి. గత ఏడాదితో పోలిస్తే 50 శాతం వృద్ధి నమోదైంది. గుజరాత్, తమిళనాడు తీర ప్రాంతాల్లో ఆఫ్‌షోర్ పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం రూ.7,453 కోట్ల నిధులను కేటాయించింది.
