టెక్ బాల్ సెమీస్లో క్విన్సీ డిసౌజా

టెక్ బాల్ సెమీస్లో క్విన్సీ డిసౌజా

నాగోయా: ఆసియా క్రీడల్లో కొత్తగా ప్రవేశపెట్టిన టెక్ బాల్‌‌లో ఇండియా చరిత్రకు అడుగు దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో క్విన్సీ జోవాకిమ్‌‌ డిసౌజా సెమీస్‌‌లోకి దూసుకెళ్లి పతకానికి చేరువైంది. గ్రూప్‌‌–ఎ తొలి మ్యాచ్‌‌లో డిసౌజా 2–1 (10–12, 12–11, 13–11)తో టాప్‌‌సీడ్‌‌ యునా సకామోటో (జపాన్‌‌)పై సంచలన విజయం సాధించింది.

రెండో మ్యాచ్‌‌లోనూ డిసౌజా 2–0తో 12–9, 12–7తో కొయెమ్‌‌యాన్‌‌ డివైపై (కంబోడియా)ను చిత్తు చేసింది. దాంతో గ్రూప్‌‌లో టాప్‌‌ ప్లేస్‌‌తో డైరెక్ట్‌‌గా సెమీస్‌‌కు అర్హత సాధించింది. సెమీస్‌‌లో డిసౌజా.. సుమయాతో (ఇండోనేసియా)తో తలపడనుంది. ఇందులో గెలిస్తే టెక్‌‌ బాల్‌‌లో ఇండియాకు తొలి పతకం ఖాయం అవుతుంది. ఒకవేళ ఓడితే ఆదివారం జరిగే కాంస్య పతక పోరులో మరో చాన్స్‌‌ ఉంటుంది.

మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌ క్వార్టర్స్‌‌లో డిసౌజా–మహ్మద్‌‌ అనస్‌‌ ఇమ్రాన్‌‌ బేగ్‌‌.. వియత్నాం జోడీ చేతిలో ఓడారు. అయితే రెపిచేజ్‌‌ రౌండ్‌‌ ద్వారా మెడల్‌‌ రేసులోనే ఉన్నారు.