కార్డిఫ్: ఛేజింగ్‌లో టామ్ బాంటమ్ (52 నాటౌట్) హాఫ్ సెంచరీకి తోడు బౌలింగ్‌లో లియామ్ డాసన్ (3/32) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది.
టాస్ ఓడిన శ్రీలంక 20 ఓవర్లలో 145/9 స్కోరు చేసింది. పాథుమ్ నిశాంక (37) టాప్ స్కోరర్. చరిత్ అసలంక (31), వానిందు హసరంగ (27), లాహిరు ఉడార (21) ఫర్వాలేదనిపించారు. ఆర్చర్, ఓవర్టన్ చెరో రెండు వికెట్లు తీశారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 12.1 ఓవర్లలోనే 146/4 స్కోరు చేసి నెగ్గింది. బాంటమ్‌కు తోడుగా బట్లర్ (30), హ్యారీ బ్రూక్ (23), అనెరున్ డొనాల్డ్ (21) రాణించారు. డాసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరి టీ20 శనివారం ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరుగుతుంది.
