సెమీస్కు చేరిన ఇండియా.. ఆసిన్ గేమ్స్ 2026లో జపాన్ చిత్తు

సెమీస్కు చేరిన ఇండియా.. ఆసిన్ గేమ్స్ 2026లో జపాన్ చిత్తు

ఆసియన్ గేమ్స్  2026క్వార్టర్ ఫైనల్ లో ఇండియా సూపర్ డూపర్ పర్ఫామెన్స్ తో జపాన్ ను మట్టికరిపించింది. వాళ్ల దేశంలో వాళ్లనే చిత్తు చేయడం డిఫెండింగ్ చాంపియన్ ఇండియాకు థ్రిల్లింగ్ విక్టరీ. 2026 సెప్టెంబర్ 18న జరిగిన టీ20 మ్యాచ్ లో 19.5 ఓవర్లలో  కేవలం 57 పరుగులు మాత్రమే చేసి ఢీలా పడిపోయింది జపాన్. 

భారత మహిళల బౌలింగ్ కు జపాన్ పరుగులు తీయడానికి చాలా తీవ్రంగా శ్రమించినా లాభం లేకుండా పోయింది. చరణీ నాలుగు వికెట్లు తీసి జపాన్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టింది. మరోవైపు షఫాలీ వర్మ రెండు వికెట్లు, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్ చెరో వికెట్ తీయటంతో జపాన్ బ్యాటర్లు పరుగులు తీయలేకపోయారు. 57 రన్స్ చేసి 19.5  ఓవర్లలో ఆలౌట్ అయ్యారు. 

జపాన్ విధించిన స్వల్ప టార్గెట్ ను కేవలం 5 ఓవర్లలోనే ఊదేశారు హార్మన్ సేన. షఫాల్ వర్మ 15 బంతులలో 40 రన్స్ మెరుపు ఇన్నింగ్స్ తో సునాయాసంగా మ్యాచ్ గెలిచారు. 5వ ఓవర్లో షఫాలీ వరుసగా 4,4 సాధించగా, ఆ తర్వాత రిచా ఘోష్ ఫోర్ కొట్టి స్ట్రైక్ రొటేట్ చేసింది. దీంతో స్ట్రైక్ లోకి వచ్చిన షఫాలీ వర్మ.. సిక్స్ తో ఇన్సింగ్స్ పూర్తి చేసింది. దీంతో ఇండియా 8 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచి ఆసియన్ గేమ్స్ 2026 సెమీస్ కు ఎంటరైంది ఇండియా.