ఢిల్లీలో మరో నిర్భయ ఘటన..మైనర్ బాలికపై నలుగురు అత్యాచారం.. 8సార్లు కత్తితో పొడిచారు

ఢిల్లీలో మరో నిర్భయ ఘటన..మైనర్ బాలికపై నలుగురు అత్యాచారం.. 8సార్లు కత్తితో పొడిచారు

దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ ఘటన వెలుగు చూసింది. 16 ఏళ్ల  మైనర్ బాలికపై నలుగురు కిరాతకులు అత్యాచారం, హత్య ఘటన కలకలం రేపుతోంది. కదులు తున్న టెంపోలో మైనర్ అఘాయిత్యం చేసి అనంతరం కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశారు దుర్మార్గులు. అనంతరం ముండ్ల పొదల్లో పాతిపెట్టిన దారుణ ఘటన ఉదంతం ఆలస్యంగా బయటికొచ్చింది. వివరాల్లోకి వెళితే. 

ఔటర్ ఢిల్లీలోని స్వరూప్ నరగ్ లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి ఆమె  మృతదేహాన్ని ముండ్ల పొదల్లో పడేశారు నలుగురు దుర్మార్గులు.  ఈ కేసులో  ముగ్గురు మైనర్లు, 19 ఏళ్ల మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు సంచలన విషయాలు బయటికొచ్చాయి. కదులుతున్న గూడ్స్ టెంపోలో బాలికపై అత్యాచారానికి పాల్పడి  అనంతరం  ఆమెను పథకం ప్రకారం కత్తితో పొడిచి హత్య చేసి స్వరూప్ నగర్ లో శివారులో ని నిర్మానుష్య ప్రదేశంలో ముండ్ల పొదల్లో పడేసినట్లు పోలీసుల  విచారణలో తేలింది. నిందితుల్లో ముగ్గురు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్టు నిందితుల విచారణలో వెల్లడైంది. నాల్గో నిందితుడు లైంగిక దాడి చేయనలేదని చెబుతుండగా.. ఈ దారుణంలో అతని పాత్రపై  పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. 

ఈ ఘటన సెప్టెంబర్ 12 రాత్రి జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. మరుసటి రోజు ఉదయం కుషక్ రోడ్డుపక్కన  ఉన్న  ఓ  ఖాళీ స్థలంలోమృతదేహాన్ని ఉన్నట్లు సమాచారం అందడంతో  ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు.  చనిపోయింది మైనర్ అని, ఆమె శరీరంపై ఎనిమిది కత్తిపోట్లు ఉన్నట్లు  గుర్తించారు.  మృతురాలు ఎవరూ ఎందుకు హత్యకు గురైంది అనేకోణంలో విచారణ  చేపట్టగా సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా  షాకింగ్ నిజాలు  తెలిశాయి. 

సీసీటీవీ ఫుటేజ్ లో ఘటనా స్థలంలో ఓ టెంపోను గుర్తింని పోలీసులు.. టెంపో కోసం గాలించగా  బాలిక హత్యకు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయి. 

స్వరూప్ నగర్  కు చెందిన 16 ఏళ్ల బాలికను  ఆమె స్నేహితుడే మరికొందరు మైనర్లతో కలిసి అత్యాచారం చేసి హత్య  చేసినట్లు  షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెప్టెంబర్ 12 రాత్రి  స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన బాలికపై నలుగురు  నిందితులుఅత్యాచారం చేసి హత్య  చేసినట్లు తేలింది.  నిందితు లపై BNS లోని పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు .. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.