నెస్లే అమ్ముతున్న బేబీ ఫుడ్స్‌పై FSSAI కేసులు.. మీరూ పసిపిల్లలకు ఇవి తినిపిస్తున్నారా?

నెస్లే అమ్ముతున్న బేబీ ఫుడ్స్‌పై FSSAI కేసులు.. మీరూ పసిపిల్లలకు ఇవి తినిపిస్తున్నారా?

ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ చర్యలతో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలు సరిగా పాటించలేదనే కారణంతో ఆ సంస్థపై లీగల్ కేసులు నమోదయ్యాయి. ఈ వార్త బయటకు రావటంతో సెప్టెంబర్ 18న స్టాక్ మార్కెట్లో నెస్లే షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి.

మూడు ఉత్పత్తులపై కేసులు..
నెస్లే కంపెనీకి చెందిన ఇన్ఫాంట్ న్యూట్రిషన్, నాన్ ఎక్సెలా ప్రో స్టేజ్ 1, లాక్టోజెన్ ప్రో 1 అనే ప్రొడక్ట్స్ పై FSSAI.. 3 వేర్వేరు కేసులు నమోదు చేసింది. ఆన్‌లైన్ వేదికలపై ఈ ఉత్పత్తుల సేల్స్ పెంచేందుకు చేస్తున్న యాడ్స్ పై ఫుడ్ సేఫ్టీ అథారిటీ తీవ్రంగా స్పందించింది.

బయోటిన్ లోపం..
నాన్ ఎక్సెలాలో.. 5 HMOs, వే ప్రోటీన్ అంశాలు ఉండగా, లాక్టోజెన్ విషయంలోనూ యాడ్స్ రూల్స్ ఉల్లంఘించినట్లు తేలింది. పసిపిల్లలకు ఇచ్చే ఆహారాన్ని అడ్వర్టైజ్‌మెంట్లు చేయడం, అమ్మకాలను పెంచేలా ప్రచారం చేయడం చట్టప్రకారం నేరం. ఇది 2020 FSS(Foods for Infant Nutrition) నిబంధనలతో పాటు IMS చట్టానికి విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఫాలో-అప్ ఫార్ములా నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా.. శిశువుల ఆరోగ్యానికి అత్యంత కీలకమైన బయోటిన్ మోతాదు తక్కువగా ఉన్నట్లు తేలింది. రెఫరల్ ల్యాబ్ పరీక్షల్లోనూ ఇదే విషయం రుజువైంది.

ALSO READ : సూపర్ బ్రేక్ ఫాస్ట్:వారానికి రెండు సార్లు..

పసిపిల్లల పోషకాహార విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్(FSSAI) స్పష్టం చేసింది. ఆహార భద్రతను కాపాడేందుకే ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ పరిణామాలు అన్ని ఆహార తయారీ కంపెనీలకు నిబంధనలు కచ్చితంగా పాటించాలనే హెచ్చరికగా మారింది.