న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ నాయకులు అస్వస్థతకు గురయ్యారన్న వార్తలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. అవన్నీ నకిలీ, తప్పుదోవ పట్టించే వార్తలని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న దురుద్దేశపూర్వక పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. బ్రిక్స్ సదస్సుకు హాజరైన ప్రపంచ నేతలు ఎవరూ అనారోగ్యానికి గురికాలేదని ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎంఈఏ ఫ్యాక్ట్-చెక్ విభాగం క్లారిటీ ఇచ్చింది. బ్రిక్స్ సదస్సుకు హాజరైన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో సహా పలువురు నాయకుల అస్వస్థతకు గురయ్యారన్న వార్తల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
చైనా అధ్యక్షుడికి తీవ్ర అస్వస్థత
2026, సెప్టెంబర్ 12, 13వ తేదీలలో ఢిల్లీ వేదికగా18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ తదితర కూటమి సభ్యులు హాజరయ్యారు. అయితే, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ బ్రిక్స్ సదస్సులో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. దీంతో ప్రత్యేక విమానంలో అత్యవసరంగా ఆయనను చైనాకు తరలించారని చైనా డెమొక్రటిక్ పార్టీ చైర్మన్ వాంజున్ షీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం జిన్ పింగ్ ఆరోగ్యం విషమంగా ఉందని ఆయన ఆరోపించారు.
అందుకే జిన్ పింగ్ ప్రధాని మోడీ ప్రపంచ నాయకులకు ఇచ్చిన గాలా డిన్నర్‌కు హాజరు కాలేదని పేర్కొన్నారు. ఇదే బ్రిక్స్ సదస్సులో దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా సైతం అనారోగ్యానికి గురయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో బ్రిక్స్ సదస్సులో పలువురు ప్రపంచ నాయకులు అస్వస్థతకు గురయ్యారన్న వార్తలపై భారత ప్రభుత్వం స్పందించింది. అవన్నీ ఫేక్ వార్తలనీ.. బ్రిక్స్ సదస్సులో జిన్ పింగ్ సహా ప్రపంచ దేశాధినేతలు ఎవరూ అస్వస్థతకు గురి కాలేదని తెలిపింది.
ALSO READ : చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కోమాలో ఉన్నారా..
ఇదిలా ఉంటే.. జిన్పింగ్ అనారోగ్యంపై వస్తున్న వార్తలు నిజం కాదని చైనా అధికారిక న్యూస్ వెబ్ సైట్ english.www.gov.cn రాసింది. న్యూఢిల్లీ నుంచి బీజింగ్ వచ్చిన తర్వాత జిన్ పింగ్ కు ఎటువంటి ఆనారోగ్యం లేదని తెలిపింది.18 బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొని చైనా మంత్రులు, అధికారులతో కలిసి ఆరోగ్యంగా తిరిగి వచ్చారని gov.cn కథనాలు చెబుతున్నాయి.
