అలా చెబితే చాలు.. ఇలా గ్రౌండ్లోకి దిగిపోతారు మనోళ్లు.. నిన్నటికి నిన్న యూపీఐ నిబంధనలు మారుస్తూ మోదీ సర్కార్ తీసుకొచ్చిన విధానంతో.. వ్యాపారులు అప్పుడే తమ విజనరీని బయటకు తీశారు. 2 వేల రూపాయలు దాటితే యూపీఐ చెల్లింపులపై డబ్బులు వసూలు చేసే నిబంధన రావటంతో.. చాలా మంది వ్యాపారులు పాత విధానానికి మారుతున్నారు.
UPI पर मर्चेंट फीस को लेकर व्यापारियों और ग्राहकों में नाराजगी बढ़ी। विरोध में दुकानदार ने UPI भुगतान को बढ़ावा देने वाले पेमेंट बोर्ड दुकान से हटा दिए।#UPI #DigitalPayments #MerchantFee #OnlinePayments pic.twitter.com/6DItyYRqFY
— NBT Hindi News (@NavbharatTimes) September 16, 2026
మరికొందరు అయితే క్యాష్ అయితే 50 రూపాయలు.. UPI అయితే 51 రూపాయలు అంటూ బాదుడు మొదలుపెట్టేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ విధానం అమల్లోకి వచ్చేది 2026, అక్టోబర్ 15వ తేదీ నుంచే.. మన వ్యాపారులు మాత్రం ఒక నెల అడ్వాన్స్గా ఉండటం సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది.
యూపీఐ పేమెంట్లపై తాము ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందనే భయంతో వ్యాపారులు ‘క్యాష్ ఓన్లీ’ అనే బోర్డులు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేంద్రం చేసిన ప్రకటనతో లిక్విడ్ క్యాష్కు డిమాండ్ పెరిగింది. ప్రజలు ఏటీఎంల దగ్గర క్యూ కడుతున్నారు. ఎందుకైనా మంచిదని అవసరం ఉన్నా.. లేకపోయినా లిక్విడ్ క్యాష్ను వీలైనంత ఎక్కువగా విత్ డ్రా చేసి తమ దగ్గర ఉంచుకుంటున్నారు. ఏటీఎంల దగ్గర రద్దీ పెరిగింది.
►ALSO READ | బైక్స్‌కు ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ కొట్టరా..? బంకుల్లో కొత్త పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్
UPI విధానాన్ని తీసుకురావాలని దేశ ప్రజలు డిమాండ్ చేయలేదు. డిజిటల్ ఇండియా.. డిజిటల్ ఎకానమీ అనే పేరుతో యూపీఐ పేమెంట్లకు ప్రజలను అలవాటు చేశారు. సౌలభ్యంగా అనిపించడంతో ప్రజలు కూడా UPI పేమెంట్స్ చేసేందుకే మొగ్గుచూపారు. పర్సుల్లో నోట్లకు కాలం చెల్లింది. అంతకు ముందు పర్సులో రెండు, మూడు వేలు కనీసం వెయ్యి రూపాయిలైనా ఉంచుకునే ప్రజలు ఏటీఎం సెంటర్ల వైపు వెళ్లడమే మానేశారు. తోపుడు బండ్లపై కూరగాయలు అమ్ముకునే చిన్న వ్యాపారుల దగ్గర కూడా UPI అందుబాటులో ఉండటంతో మెజారిటీ ప్రజలు లిక్విడ్ క్యాష్ తమ దగ్గర ఉంచుకోవడం పూర్తిగా తగ్గించేశారు.
ఇంతగా ప్రజలు UPI పేమెంట్లకు అలవాటు పడిన తర్వాత కేంద్రం ఛార్జీలు వడ్డన మొదలుపెట్టింది. వ్యాపారులే చెల్లిస్తారని కేంద్రం చెబుతున్నా.. వ్యాపారులు దేశోద్ధారకులేం కాదని.. కస్టమర్ల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. UPI పేమెంట్లు తగ్గి జనాలు మళ్లీ చేతుల్లో డబ్బులు ఉంచుకుని.. డబ్బులతో క్రయవిక్రయాలు చేసే రోజులు వచ్చాయనే స్పష్టంగా అర్థమవుతుంది.
