పుట్టిన రోజున కేక్ కొనుక్కుని వస్తున్న వ్యక్తిని.. వేగంగా ఢీ కొట్టి వెళ్లిపోయిన కారు

పుట్టిన రోజున కేక్ కొనుక్కుని వస్తున్న వ్యక్తిని.. వేగంగా ఢీ కొట్టి వెళ్లిపోయిన కారు

హిట్​ అండ్​ రన్​.. కారు ఢీకొట్టిందా ఇంకో మాటే లేదు.. ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. గుర్తు తెలియని వాహనాలు వేగంగా వచ్చి రోడ్డు దాటున్న వారి ప్రాణాలు తీస్తున్న  ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాల్లో  హిట్ అండ్​ రన్​ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. ప్రమాదం జరిగితే చాలు ప్రాణం పోవడం లేదా శరీరం ముక్కలు అవడం వంటి ఘటనలే ఎక్కువ.  ఇటీవల దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన  వరుస హిట్​అండ్​ రన్​ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా  సంచలనం సృష్టించిన సెప్టెంబర్​ 13నాటి ఢిల్లీ హిట్అండ్​ రన్​ ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగు చూసింది. రెండు ప్రమాదాల్లో బాధితుల శరీరాలు ముక్కలు ముక్కలు అయ్యాయి. ప్రాణాలతో  ఉన్న సజీవ శవాలుగా మారారు. మద్యం మత్తులో డ్రైవింగ్, మైనర్లు కార్లు నడపడం వంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదాలు పెరుగుతున్నాయి. 

గురువారం గ్రేటర్​ నోయిడా లోని  ఏక్​ మూర్తి చౌక దగ్గర జరిగిన హిట్ అండ్ రన్ లో32 ఏళ్ల వ్యక్తికి 32 చోట్ల బోన్​ ఫ్యాక్చర్లు అయ్యాయి.  కారు రియర్-వ్యూ కెమెరాలో రికార్డ్ అయిన ప్రమాదఘటనకు సంబంధించిన వీడియోలో, ఢీకొన్న ధాటికి ఆ వ్యక్తి గాలిలోకి ఎగిరిపడినట్లు కనిపిస్తోంది. కారు నడిపి ప్రమాదానికి కారణమైన 24 ఏళ్ల విద్యార్థి డ్రైవర్ను అరెస్టు చేశారు. బాధితుడు హిమాంశు రాయ్  ఫిర్యాదు మేరకు బిస్రాఫ్ పోలీస్ స్టేషన్​ లో కేసు నమోదు అయింది. 

ఈ ఘటన సెప్టెంబర్ 5 ఉదయం 4.35 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.  తన పుట్టిన రోజును భార్యపిల్లలతో జరుపుకునేందుకుకేక్​ తీసుకెళ్తుండగా జరిగింది. ఆరోజు  పని ఒత్తిడి వల్ల  తెల్లవారు జామున బర్త్​ డేను జరుపుకునేందుక నిర్ణయించుకున్నాడు బాధితుడు. ఇంతలోనే ఈ ఘటన జరగడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.   

ALSO READ : ప్రజాస్వామ్యాన్ని చంపేసినందుకు హ్యాపీ బర్త్‌డే మోడీ జీ

హిట్​ అండ్​ రన్​ లో బాధితుడి శరీరంలో 32 చోట్ల బోన్స్​ విరిగాయి. ఢీకొట్టిన కారు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో బాధితుడిని ఢీకొట్టిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. స్థానికుల సాయంలో ఆస్పత్రిలో చేర్చారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో  పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీఫుటేజ్​ ఆధారంగా కారును గుర్తించారు. ప్రమాదానికి కారణమైన ప్రియాన్షు అనే డ్రైవర్​ ను  అరెస్ట్ చేశారు. 

గురుగ్రామ్ లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై బైకర్​ ను కొందరు వ్యక్తులు వెంబడించి ఢీకొట్టిన ఘటన జరిగిన కొద్ది రోజులకే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న వాహనాల మధ్యలో శివానీ చౌహాన్  అనే  యువతి బైకును కారుతో ఢీకొట్టి, ఆమె కింద పడిపోయేలా చేసిన కళ్యాణ్ బైన్స్​ నాగ్​(33)ను మంగళవారం రాజస్థాన్​ లో దౌసాలో అరెస్టు చేశారు.అతని తోపాటు కారులో ఉన్న లవ్నీష్ (32)ను కూడా అరెస్టు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఆమెను చంపేందుకు బైక్​ ను కారుతో ఢీకొట్టినట్లు గుర్తించారు పోలీసులు. 

ఇదిలా ఉంటే.. గురువారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో గురుగ్రామ్‌లోని న్యూ పాలం విహార్‌లోని శ్రీ రామ్ చౌక్ సమీపంలో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై కూడా ఇలాంటి ఘటనే జరిగింది.  ఢిల్లీ వైపు నుంచి అతివేగంగా వచ్చిన  గుర్తు తెలియని కారు ఢీకొని ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు . ఎక్స్‌ప్రెస్‌వేపై గ్రిల్స్ అమర్చుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 
  
రోడ్డుపై ఒక్క క్షణం నిర్లక్ష్యం ఓ కుటుంబాన్ని జీవితాంతం విషాదంలో ముంచేస్తోంది. మద్యం మత్తులో డ్రైవింగ్, అతివేగం, మైనర్ల చేతుల్లో వాహనాలు, ప్రమాదం జరిగిన వెంటనే పారిపోవడం వంటి కారణాల వల్ల హిట్ అండ్ రన్ ఘటనలు పెరుగుతున్నాయి.కఠిన ట్రాఫిక్  నిబంధనలు, సిసీటీవీ నిఘా, వేగం నియంత్రణ వంటి చర్యలతో పాటు కఠిన శిక్షలు అమలు చేయడం ద్వారా హిట్ అండ్ రన్ ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.