Good Health: పరగడుపున ఇవి తిన్నా.. తాగినా.. ఆరోగ్యాన్ని చేతులారా పాడు చేసుకున్నట్టే...!

Good Health:  పరగడుపున ఇవి తిన్నా.. తాగినా.. ఆరోగ్యాన్ని చేతులారా పాడు చేసుకున్నట్టే...!

చాలామంది ఈ రోజుల్లో డైటింగ్,  వెయిట్ లాస్​ షెడ్యూల్ పేరుతో ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు. దానికి బదులు కాఫీ లేదా టీ తాగేస్తే సరిపోతుందన్న అపోహతో ఉంటున్నారు. ఇంకొందరు మార్నింగ్ ఎక్సర్ సైజ్ కు  టైమ్ లేదని, ఇంకొందరు ఉద్యోగాలకు పరిగెత్తే హడావిడిలో క్రమంలో బ్రేక్ ఫాస్ట్ మానేస్తు న్నారు. కానీ పరగడపున పోషకాలున్నవి తినటంతోపాటు కొన్నింటికి దూరంగా ఉండాలి.

యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు వద్దు: యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ పరగడుపున తీసుకోకూడదు. అలా చేయడంవల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా అది గ్యాస్ట్రిక్ బ్లీడింగ్ కు దారి తీస్తుంది. అలాగే వాడుతున్న డ్రగ్స్ కూడా మంచి ఫలితాలను ఇవ్వకపోగా, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతాయి.

కాఫీ తాగొద్దు:  పరగడపున కాఫీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఛాతిలో మంట, జీర్ణాశయ సమస్యలకు దారితీస్తుం ది. కాబట్టి ఉదయం పరగడపున కాఫీ, టీ తాగడానికి బదులు నిమ్మరసంలో తేనె కలుపుకుని తాగొచ్చు.

ఆల్కహాల్ తీసుకోవద్దు: ఉదయం ఏమీ తినకుండా ఆల్కహాల్ తీసుకుంటే... శరీరంలో ఆల్కహాల్ గ్రహించే శక్తి రెండుశాతం పెరుగుతుంది. తర్వాతతిన్న ఆహారం జీర్ణం కాకుండా హ్యాంగోవర్ కు దారి తీస్తుంది. అంతేకాదు, ఆరోగ్యం బాగుండాలంటే కేవలం పరగడుపునే కాదు, మందు అలవాటుకు దూరంగా ఉంటేనే మంచిది.

చూయింగ్ గమ్ తినొద్దు :  టైమ్ అయ్యిందని ఖాళీ కడుపుతో ఆఫీసు లకు వెళ్తుంటారు చాలామంది. ఆ టైమ్ లో పరగడుపునే చూయింగ్ గమ్ తినడం వల్ల పొట్టలో జీర్ణ రసాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దానివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

నిద్రపోతారు: ఉదయంపూట ఏమీ తినకపోవడం వల్ల... ఆకలి, తక్కువ గ్లూకోజ్ లెవల్స్ అతి నిద్రకు కారణమవుతాయి. దానివల్ల చేసే పనిలో ఏకాగ్రత తగ్గుతుంది. ఇలా తరచూ జరుగుతూ ఉంటే, రాత్రిపూట నిద్రలేమి సమస్య కూడా రావచ్చు.