ప్రస్తుతం స్మార్ట్ఫోన్ యుగం నడుస్తుంది. అవసరం ఉన్నా.. లేకపోయినా పొద్దున్నే లేవడంతోనే ఫోన్ పట్టుకుంటున్నాం... అందులో ఏవేవో చూస్తూ.. ఆన్ లైన్లో అవసరం ఉన్నా లేకపోయినా పర్చేజ్ చేస్తున్నాం.. అక్కర్లేని వింటూ.. బెడ్ దిగుతాం.. దీంతో మనస్సు పరిపరి విధాలా వెళుతూ ఇంద్రియాలు నిగ్రహం కోల్పోతాయి. అలా చేయడం వలన మనిషి పాతాళానికి వెళుతున్నాడు.
చూసిందల్లా కావాలనుకోవడం, అవసరం లేకున్నా వినాలనుకోవడం, నాలుక రుచుల వెంట, మనసు కోరికల వెంట పరుగులు తీయడం.. ఇలా ఇంద్రియా లు నిగ్రహం కోల్పోతే మనిషి పాతాళంలోకి పడిపోతాడు.
ఇంద్రియ నిగ్రహంతో ఎందరో మహాత్ములయ్యారు. దేవతలకు, రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతోంది. యుద్ధంలో తమకు సాయం చేయాలని దేవతలు అర్జునుడిని స్వర్గానికి పిలుస్తారు. తన యుద్ధ నైపుణ్యంతో అర్జునుడు దేవతలకు విజయం అందిస్తాడు. అర్జునుడి పరాక్రమానికి దేవలోక సౌందర్యరాశి ఊర్వశి ఆకర్షితురా లు అవుతుంది.
దీనురాలిని, నాకు కూడా సాయం చేయండి అర్జునా.. అని అర్థిస్తుంది. 'నీ ఆపద ఏమిటి' అని అర్జునుడు అడుగు గుతాడు. దానికి 'నాకు నీలాంటి పుత్రుడు కావాలి. ప్రసాదించు' అని కోరుతుంది ఊర్వశి. అర్జునుడు ఆమె మాటలోని మర్మా న్ని గుర్తిస్తాడు. 'పుత్రుడి కోసం నవమాసాల నిరీక్షణ ఎందుకు? ఈ రోజు నుంచి నేను నీకు పుత్రుడినే!' అంటూ చేతులు జోడించి ఆమెకు సమస్కరిస్తాడు. అర్జునుడి ఇంద్రియ నిగ్రహానికి ఊర్వశి ఆశ్చర్యపోతుంది. ఆ నిగ్ర హమే అతడిని అజేయుణ్ణి చేసింది.
