హైడ్రాలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. 2026 సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని హైదరాబాద్ లోని హైడ్రా కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు కమిషనర్ రంగనాథ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైడ్రా మూడు వేల ఎకరాలకు పైగా భూములను కాపాడినట్లు చెప్పారు. వాటి విలువ ఒకటిన్నర లక్షల కోట్లకు పైగా ఉంటుందన్నారు.
ప్రజా ఆస్తుల రక్షణ హైడ్రా ప్రధాన విధి అని ఈ సందర్భంగా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులు, నాలాల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల నియంత్రణ, నిర్వహణ కూడా హైడ్రా ప్రధాన విధులేనని అన్నారు.
ప్రజా ఆస్తులను కాపాడటం భవిష్యత్ తరాల హక్కులను పరిరక్షించడమే హైడ్రా విధి అని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగేదే ప్రజాపాలన అని అన్నారు. తెలంగాణలో జరిగిన ప్రతి ఉద్యమంలో భూమి ప్రధాన అంశంగా ఉందన్నారు. ప్రజా ఆస్తుల పరిరక్షణ లక్ష్యంగా హైడ్రాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
హైడ్రా చర్యలను ప్రజలు సూక్ష్మంగా పరిశీలిస్తున్నారని అన్నారు. హైడ్రా చర్యలకు ప్రజల నుంచి పూర్తి స్థాయి మద్దతు లభిస్తోందన్నారు. ప్రజా ఆస్తుల పరిరక్షణలో నిబద్ధతతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు.
