22ఏ పాపం బీఆర్ఎస్ సర్కారుదేనని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ పాలనలో భూదోపిడీపై విచారణ జరిపిస్తామని అన్నారు. 2026 సెప్టెంబర్ 17న మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్.. కేసీఆర్ కుటుంబం వేల ఎకరాలను దోచుకుందని ఆరోపించారు.
ఇక వీలైనంత త్వరగా డీసీసీల నియామకం చేపట్టనున్నట్లు చెప్పారు పీసీసీ చీఫ్. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ విదేశాలకు వెళితే ఆమె స్థానంలో కొత్త ఇంఛార్జి వస్తారని ఈ సందర్భంగా చెప్పారు.
మంత్రి వర్గ విస్తరణ అంశం అధిష్టానం చేతుల్లో ఉందన్నారు. మంత్రివర్గాన్ని విస్తరించాలా వద్దా అనేది సీఎం రేవంత్ ఇష్టమని ఈ సందర్భంగా చెప్పారు.
