నుదుటిపై బొట్టు .. ఏకాగ్రతను పెంచుతుంది.. తలనొప్పి తగ్గుతుంది..సైన్స్ చెప్పే అసలు నిజం ఇదే..!

నుదుటిపై బొట్టు .. ఏకాగ్రతను పెంచుతుంది.. తలనొప్పి తగ్గుతుంది..సైన్స్ చెప్పే అసలు నిజం ఇదే..!

రోజులు మారుతున్నాయి.  యూత్​ సంప్రదాయాలను పట్టించుకోవడం లేదు. పాటించకపోతే ఏమవుతుంది అని ఎదురు ప్రశ్న తో కొంతమంది వితండంగా వాదిస్తుంటారు.హిందూ సంప్రదాయంలో బొట్టు పెట్టుకోడాన్ని శుభానికి, పాజిటివ్ ఎనర్జీకి సంకేతంగా భావిస్తారు. పూజ తర్వాత బొట్టు పెట్టుకున్నారంటే, ఆ వ్యక్తి దేవుడి ఆశీస్సులు తీసుకున్నాడని అర్థం. ఇది కేవలం ఆధ్యత్మికమే కాదని కనుబొమ్మల మధ్య.. నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వెనుక సైన్స్​ పరంగా చాలా ఉపయోగాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.   

 హిందూ సాంప్రదాయంలో నుదుటిపై బొట్టు పెట్టుకోవడం కేవలం అందం కోసమే కాదు, దీని వెనుక మన రుషులు అందించిన ఒక అద్భుతమైన సైన్స్  దాగి ఉంది.నాడీ శాస్త్రం ప్రకారం మన శరీరంలోని 72వేల నాడులున్నాయి. వీటిలో అత్యంత ముఖ్యమైన ఇడ, పింగళ మరియు సుషుమ్న నాడులు.  ఈ మూడు  కనుబొమ్మల మధ్య కలుస్తాయి.  అందుకే  ఆ ప్రదేశాన్ని ని దీనినే త్రివేణి సంగమం అంటారు. అక్కడ బొట్టు పెట్టుకుని ప్రెస్ చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది.  ఇంకా  మెదడులోని ఎడమ, కుడి భాగాలు సరిగ్గా బ్యాలెన్స్ అవుతాయి.  అందుకే తల నొప్పి వచ్చినప్పుడు నుదుటిని కొద్దిగా ప్రెస్​ చేస్తాము కదా..!

బొట్టు  పెట్టుకోవడం భారతీయ హిందూ సంస్కృతిలో చాలా ఇంపార్టెంట్​ అని పెద్దలు చెబుతుంటారు. కాని ప్రస్తుతం యూత్​ స్టైల్ స్టేట్‌మెంట్ చేయడానికి .. అందంగా కనపడేవదుకు.. వివిధ రకాల తిలకాలను వాడుతున్నారు. బొట్టు పెటుకోకొనే ఆచారం  కొనసాగుతోంది. నిజానికి నుదుటిపైన తిలకం వెనుక మతం మాత్రమే కాకుండా శాస్త్రీయంగా వాస్తవాలు కూడా ఉంది.

ఎవరైనా సరే బొట్టును  రెండు కనుబొమ్మల మధ్యలో పెట్టుకుంటారు. నుదిటి మధ్యన .. శరీరంలో ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఈ చక్రాలన్నీ వేదాలలో కూడా వివరించబడ్డాయి. తిలకం పెట్టుకోవడం వల్ల అంతర్గత జ్ఞానాన్ని పెంచే శక్తులు అభివృద్ధి చెందుతుందని నమ్ముతారు.

- సైన్స్ పరంగా చూస్తే పీనియల్ గ్రంధి నుదురు మధ్యలో ఉంటుంది. బొట్టు పెట్టుకొనేటప్పుడు ఒత్తిడిని సృష్టిస్తుంది.. ఇది గ్రంథి వేగంగా పని చేసేలా చేయడం వలన  మనస్సును ప్రశాంతపరుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

మరో ముఖ్య విషయం ఏంటంటే.. పీనియల్​ గ్రంథి చురుకుగా పనిచేయడం వలన ఏకాగ్రత ఏర్పడుతుంది. ఆక్యుప్రెషర్ సూత్రాల ప్రకారం, ఈ పాయింట్ తలనొప్పి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇక్కడ బొట్టు పెట్టుకోవడం వలన  నరాలు, రక్త నాళాల ప్రసరణ మెరుగుపడుతుంది.నుదుటిపై  ఒత్తిడి కలగడంవలన  నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందంటారు. నుదురు  ప్రాంతంలో  చెవికి సంబంధించిన నరం కూడా ఉంటుంది, దీని ఒత్తిడి వల్ల వినే శక్తి పెరుగుతుందంట.

ఏ బొట్టు పెట్టుకుంటే ఏ ప్రయోజనం?

  • గంధం: మెదడుకు చల్లదనాన్ని ఇస్తుంది.
  • కుంకుమ: రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది.
  • విభూతి: తలనొప్పి ..మాయను తొలగిస్తుంది.

 ప్రస్తుతం యూత్​ ప్యాషన్​ పేరుతో నుదుటిపై  బొట్టుపెట్టుకోవడం మానేశారు.  కొంతమంది అయితే ఇంట్లో పెద్దవారు ఏమన్నా అంటారేమోనని ఇంట్లో పెట్టుకొని బయటకు వచ్చి చెరిపేసుకుంటున్నారు. ఇకనైనా అలా చేయకుండా మన సంస్కృతిని..సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గ్రహించాలి. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.