కేటీఆర్  వల్ల మా కులం తలదించుకునే పరిస్థితి : విప్ బల్మూరి వెంకట్ ఆవేదన 

కేటీఆర్  వల్ల మా కులం తలదించుకునే పరిస్థితి : విప్ బల్మూరి వెంకట్ ఆవేదన 

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ మాటల వల్ల తాను ఆ కులంలో పుట్టినందుకు బాధపడుతున్నానని విప్ బల్మూరి వెంకట్ అన్నారు. ఆయన తప్పుల కారణంగా తెలంగాణలో తమ కులం తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎల్‌‌పీలో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోని పక్షంలో రాష్ట్రంలోని దళితులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. ‘కేటీ రామారావు కాదు.. ఆయన ఓ డ్రామారావు’ అని విమర్శించారు. పబ్లిసిటీ కోసం బీఆర్ఎస్  నేతలతో పాటు వాళ్ల పీఆర్‌‌‌‌వోలు, పీఏలు కూడా పోలీసులను తిట్టి, దాడికి ప్రయత్నించారని ఆరోపించారు.