హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈనెల 8,9 తేదీల్లో నిర్వహించిన టీజీ టెట్ ఇన్‌సర్వీస్ టీచర్స్ ఆన్‌లైన్ పరీక్షల ప్రిలిమినరీ కీ మంగళవారం విడుదలైంది. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ schooledu.telangana.gov.in లో కీ పెట్టినట్టు టెట్ కన్వీనర్ గాజర్ల రమేశ్ ఒక ప్రకటన తెలిపారు.
‘కీ’పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. అభ్యర్థులు ఈ నెల15 నుంచి 17వ తేదీ సాయంత్రం 5:00 గంటల లోపు సంబంధిత వెబ్‌సైట్‌లోని లింక్ ద్వారా ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని సూచించారు. కాగా,ఈనెలాఖరులో ఫలితాలు రిలీజ్ చేయనున్నారు.
