Beauty tips:మచ్చల్లేని ముఖం కోసం.. కొవ్వు కరగాలంటే ఏం చేయాలో తెలుసా?

Beauty tips:మచ్చల్లేని ముఖం కోసం.. కొవ్వు కరగాలంటే  ఏం చేయాలో తెలుసా?

బరువుతోపాటు ముఖంలో కొవ్వు కూడా పెరుగుతుంది. బుగ్గలు లావెక్కుతాయి. గడ్డం, దగ్గర కూడా పెరిగిపోతుంది. దాంతో ముఖం పెద్దగా కనిపించి వయసు పెరిగినట్లు కనిపిస్తుంది. అలా కాకుండా ముఖం అందంగా కనిపించాలన్నా, ముఖ భాగంలోని కొవ్వు కరగాలంటే ఈ టిప్స్ ఫాలో కావాలి.

  • రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి. దానివల్ల ఫేస్ ట్రిమ్ అవుతుంది. ఒంట్లో కొవ్వు కూడా తొందరగా కరుగుతుంది.
  • ఉప్పు ఎక్కువగా తింటే బరువు పెరుగుతాం. దాంతో మన ముఖం కూడా ఉబ్బినట్లు కనిపిస్తుంది. అందుకే ఉప్పు తగ్గించాలి. దానివల్ల బరువు కూడా తగ్గుతాం.
  • మైక్రో, మ్యాక్రో న్యూట్రియంట్స్ బరువు తగ్గించడంలో ఉపయోగ పడతాయి. హెల్దీ ఫుడ్ తినడం వల్ల మెటబాలిజమ్ సరై కొవ్వు తొందరగా కరుగుతుంది.
  • ఫేస్ ఫ్రెష్ గా ఉండాలన్నా, స్లిమ్​ గా  కనిపించాలన్నా సరిగా నిద్ర పోవాలి. రోజుకు కనీసం 7 - 8 గంటల పాటు నిద్రపోవాలి. సరిగ్గా నిద్రపోకపోతే స్ట్రెస్ హార్మోన్, కార్టిసోల్ పెరిగి దాని ప్రభావం ముఖం మీద పడుతుంది.
  • ఒక్కో బాడీ పార్ట్ కు ఒక్కో ఎక్సర్ సైజ్ ఉంటుంది. అలానే ముఖానికి కూడా ఫేషియల్ ఎక్సర్​సైజ్ ఉంది. రోజూ ఎక్సర్​ సైజ్ చేయడం వల్ల ఫేషియల్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. దాని వల్ల ముఖం మీద కొవ్వు కరిగి, ముఖం ఫ్రెష్​గా కనిపిస్తుందని, క్లినికల్ అండ్ డయాగ్న స్టిక్ రీసెర్చ్ జర్నల్ చేసిన రీసెర్చ్​ లో శాస్త్ర్రవేత్తలు తెలిపారు.