హైదరాబాద్, వెలుగు: విద్యుత్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై యాజమాన్యంతో చర్చలు జరిగి పది హేను రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంపై పవర్ జేఏసీ సమ్మెకు సిద్ధమైంది.విద్యుత్ యాజమాన్యాల నుంచి సరైన స్పందన రాకపోవడంతో మంగళవారం హైదరాబాద్ లోని 1104 ఆఫీస్ లో ఉద్యగ సంఘాల లీడర్లు సమావేశమయ్యారు.
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు, పరిష్కారంపై చర్చించారు. అనంతరం విద్యుత్ జేఏసీ సమ్మెకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లుగా పవర్ జేఏసీ లీడర్ సదానందం ప్రకటించారు. ఈ సమావేశంలో పవర్ ఎంప్లాయీస్, ఆర్టీజన్స్ , పెన్షనర్ జేఏసీ నేతలు పాల్గొన్నారు.
