వాళ్లందర్నీ మూడో టీ20లో ఆడిస్తా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బిగ్ హింట్!

వాళ్లందర్నీ మూడో టీ20లో ఆడిస్తా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బిగ్ హింట్!

Shreyas Iyer: ఆఫ్ఘనిస్తాన్‌పై 2–0 తేడాతో టీ20 సిరీస్ కైవసం చేసుకున్న ఆనందంలో ఉన్న భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, మ్యాచ్ అనంతరం తన కెప్టెన్సీ ప్రయాణంలోని చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. మార్చిలో భారత్ రికార్డు స్థాయిలో మూడోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ స్థానంలో సారథ్య బాధ్యతలు చేపట్టిన శ్రేయస్‌కు ఆరంభంలో ఊహించని పరాభవాలు ఎదురయ్యాయి.

ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతిలో ఓటములు: 

కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐర్లాండ్ చేతిలో 0–2తో, ఇంగ్లాండ్ చేతిలో 1–4 తేడాతో భారత్ ఘోరంగా సిరీస్‌లు ఓడిపోవడంపై శ్రేయస్ మాట్లాడుతూ.. ఆరంభంలో ఎదురైన ఆ సీరియస్ పరాభవాలు మింగుడు పడని నిజాలు.. గుండెల్ని పిండేసినంత పని చేశాయి. కానీ కెప్టెన్‌గా ఒత్తిడిని తట్టుకుని సమతుల్యత సాధించడం చాలా ముఖ్యం అన్నారు. గతాన్ని పక్కనపెట్టి ప్రస్తుతాన్ని ఆస్వాదించడం నేర్చుకున్నానని అన్నారు.స్వదేశంలో కెప్టెన్‌గా సాధించిన ఈ తొలి సిరీస్ విజయం తనలో తీవ్ర నమ్మకాన్ని నింపిందని చెప్పాడు.

3వ టీ20లో బెంచ్ ఆటగాళ్లకు ఛాన్స్:  

ఇప్పటికే సిరీస్ సొంతం కావడంతో రేపు (గురువారం, సెప్టెంబర్ 17న) జరగబోయే చివరి టీ20లో తుది జట్టులో భారీ మార్పులు చేస్తామని శ్రేయస్ అయ్యర్ క్లారిటీ ఇచ్చారు. రేపటి మ్యాచ్ లో బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇస్తామని చెప్పడం ద్వారా, 15 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీ20 అరంగేట్రం దాదాపు ఖాయమైంది. సిరీస్ నెగ్గాం కాబట్టి బెంచ్‌కే పరిమితమైన మిగతా ఆటగాళ్లకు ఇదొక మంచి అవకాశం.. విభిన్న కాంబినేషన్లను ప్రయత్నించబోతున్నామని శ్రేయస్ తేల్చి చెప్పాడు.

ఆ ఎక్స్‌ట్రా పేస్ కోసమే శ్రమించా:- నితీష్ రెడ్డి

మరోవైపు రెండో టీ20లో 3 వికెట్లతో చెలరేగిన యంగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గొప్ప ఆల్‌రౌండర్ కావాలనేదే నా కల.. దానికి ఎక్స్‌ట్రా పేస్ చాలా అవసరం.. అందుకే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)లో తీవ్రంగా శ్రమించి నా బౌలింగ్ స్పీడ్‌ను పెంచుకున్నానని గర్వంగా వెల్లడించాడు. ఇక ఆఫ్ఘన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ మాత్రం పవర్‌ప్లేలోనే భారత బౌలర్లు తమను దారుణంగా దెబ్బకొట్టారని, 200+ టార్గెట్ సెట్ చేద్దామనుకుంటే భారత్ బౌలింగ్ ధాటికి 150 రన్స్ సాధించడానికే చెమటలు పట్టాయని పేర్కొన్నాడు.