ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని(56) (పూర్తిపేరు కాళీకృష్ణ శ్రీనివాస్) కన్నుమూశారు. విశాఖలోని ఆయన నివాసంలో మంగళవారం (సెప్టెంబర్ 15) గుండె పోటుతో హఠాన్మరణం చెందారు.
2004,2009 లో ఏలూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నాని అనంతరం 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి విజయం సాధించి.. వైఎస్ జగన్ మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు.
2024లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయన పూర్తి పేరు కాళీకృష్ణ శ్రీనివాస్.
రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఆళ్ల నాని మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు, అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
