హైదరాబాద్లో జాబ్స్: DRDO లోJRF & RI పోస్టులు భర్తీ

హైదరాబాద్లో జాబ్స్: DRDO లోJRF & RI పోస్టులు భర్తీ

హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ)కు చెందిన అడ్వాన్స్​డ్ సిస్టమ్స్ లాబొరేటరీ (ఏఎస్ఎల్) జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్​), రీసెర్చ్ అసోసియేట్ (ఆర్ఏ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

పోస్టు పేరు:1. జూనియర్ రీసెర్చ్ ఫెలో2.  రీసెర్చ్ అసోసియేట్.
మొత్తం ఖాళీలు: 17.

ఎలిజిబిలిటీ

జేఆర్ఎఫ్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాసులో బీఈ/ బి.టెక్​తోపాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ కలిగి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాసులో ఎంఈ/ ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి.  

ఆర్ఏ పోస్టులకు ఎలక్ట్రానిక్స్ విభాగంలో పీహెచ్‌డీ పూర్తిచేసి ఉండాలి. లేదా ఎలక్ట్రానిక్స్ విభాగంలో ప్రథమ శ్రేణిలో ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి, ఏదైనా ప్రతిష్టాత్మక సంస్థలో కనీసం మూడేళ్లపాటు రీసెర్చ్ లేదా టీచింగ్ ఎక్స్​పీరియన్స్ కలిగి ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు,  ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: అక్టోబర్ 3.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.indiascienceandtechnology.gov.inను సందర్శించండి.