జ్యోతిష్యం : కన్యారాశిలోకి సూర్యుడు.. ఐదు రాశుల వారి ఇళ్లల్లో కనకవర్షం.. అదృష్టం వెల్లివిరుస్తుంది..!

జ్యోతిష్యం :  కన్యారాశిలోకి సూర్యుడు.. ఐదు రాశుల వారి ఇళ్లల్లో కనకవర్షం.. అదృష్టం వెల్లివిరుస్తుంది..!

జ్యోతిష్య శాస్త్రప్రకారం.. గ్రహాలు ఎప్పటి కప్పుడు స్థానాలు మారుతుంటాయి.  అందుకే జీవన విధానం కూడా మారుతుంది.  పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది ( 2026) సెప్టెంబర్​ 17న ఉదయం 07:58 నిమిషాలకు గ్రహాలకు రారాజు సూర్యుడు ..కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. అక్కడే నెల రోజులు సంచారం చేయనున్నాడు.  

కన్యారాశికి అధిపతి బుధుడు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడికి, బుధుడికి మధ్య మైత్రి భావం ఉంటుంది. మిత్రుని రాశిలోకి సూర్యుడు ప్రవేశించే ఈ ఘట్టాన్ని కన్యా సంక్రాంతి అని పిలుస్తారు.ఈ ప్రభావంతో ఐదు రాశుల వారి ( సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మీన) ఇళ్లల్లో కనక వర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆ రాశుల వివరాల గురించి తెలుసుకుందాం. . 

సింహ రాశి : కన్యారాశిలో సూర్య భగవానుడి సంచారం వలన ఈ రాశి వారు శారీరకంగా మానసికంగా.. ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.   రాబడికి కొత్త మార్గాలు ఏర్పడుతాయి. బంధువులు లేదా కుటుంబ సభ్యుల నుంచి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఈ కాలంలో జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా ఇబ్బంది లేకుండా  పూర్తవుతుంది.  కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారని  పండితులు చెబుతున్నారు. 

కన్యా రాశి : సూర్యుడు ఇదే రాశిలో సంచరించడం వలన ఈ రాశి వారికి విశేషమైన ప్రయోజనాలతో పాటు  పట్టిందల్లా బంగారం అవుతుంది.   కొంతకాలంగా ఆగిపోయిన పనుల్లో వేగం పెరుగుతుంది.వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు రెట్టింపవుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.  ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. .  ప్రభుత్వ ఉద్యోగం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.   ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న పనులు పరిష్కారమవుతాయి. జాయింట్ వ్యాపారాలు కలసివస్తాయి.  ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశించిన సంబంధం కుదురుతుంది. చేతి వృత్తుల వారికి అధికంగా ఆర్డర్లు రావడంతో కష్టాలు తీరతాయని పండితులు చెబుతున్నారు. 

వృశ్చిక రాశి : సూర్యుడు ... కన్యరాశిలో సంచారం ఈ రాశి వారికి ఎంతో మేలు చేస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.ద్యోగంలో ప్రమోషన్ లేదా అధికార యోగం...  అన్ని అంశాల్లోనూ శీఘ్రగతిన పురోగతి ఉంటుందని పండితులు అంటున్నారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం పెరిగి.. . ఏ ప్రయత్నమైనా సఫలం అయ్యే అవకాశాలున్నాయి.  అధికారులతో సామరస్యం పెరిగి.. . బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు  పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామికి  ఆకస్మిక ధన లాభం వస్తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది.వృత్తి పరంగా లైఫ్​ లో సక్సెస్​ సాధిస్తారు. కెరీర్​ లక్ష్యాలను సాధించడంలో సఫలీకృతులవుతారని పండితులు చెబుతున్నారు. అనుకోకుండా పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ తో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది.  ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు.ఇల్లు, భూములకు సంబంధించిన వివాదాలు, కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.

ధనుస్సు రాశి : సూర్యుడు కన్యారాశిలో సంచరించే సమయంలో ఈ రాశి వారికి ఆత్మీయులు, మిత్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులు ప్రశంశలు.. అవార్డులు అందుకుంటారు. ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి.  వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు.   మ‌నశ్శాంతి ల‌భిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. కెరీర్​ విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారం అభివృద్ది జరుగుతుంది.  ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. వివాహితలు తమ జీవిత భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

మీన రాశి : కన్యారాశిలో ...సూర్యుడు సంచారం వలన ఈ రాశి వారు కొత్త ఒప్పందాలు చేసుకొనేందుకు ఇది శుభ సమయమని పండితులు చెబుతున్నారు .అనుకున్న దానికంటే మంచి ఫలితాలు సాధిస్తారు.వ్యక్తిత్వం మెరుగుపడటంతో ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు.   ఆర్థిక పరంగా బాగుంటుంది. ఎప్పటి నుంచో ఉన్న ఆర్థిక సమస్యల నుంచి సులువుగా బయట పడతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. సంతోషం కూడా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు.  పూర్వీకుల ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.