Team India: గాయాల నరకం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇవ్వడమే కాదు.. మ్యాచ్ విన్నర్ అనిపించుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో ఆంధ్రా ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి (3/24) సరిగ్గా ఇదే చేసి చూపించాడు. ఒకే స్పెల్‌లో ఇబ్రహీం జద్రాన్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్‌లను పెవిలియన్ పంపి ఆఫ్ఘన్ పతనాన్ని శాసించాడు. తొలి మ్యాచ్‌లో 30 రన్స్ ఇచ్చి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నితీష్, రెండో మ్యాచ్‌లో మాత్రం ఎవరు ఊహించని రేంజ్‌లో కంబ్యాక్ ఇచ్చి టీమిండియా మేనేజ్‌మెంట్‌కు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు.
హార్దిక్ తర్వాత వీళ్లే తోపులు: సన్నీ
సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. నితీష్‌పై పొగడ్తల వర్షం కురిపించాడు. హార్దిక్ పాండ్యాకు ప్రాపర్ బ్యాకప్‌గా నితీష్ ఎదుగుతున్నాడని చెబుతూనే, మరికొందరి ఆటగాళ్ల పేర్లను తెరపైకి తెచ్చాడు.
* వెంకటేష్ అయ్యర్, సూర్యాంశ్ షెడ్గే: హార్దిక్, నితీష్ మాత్రమే కాదు.. వెంకటేష్ అయ్యర్, సూర్యాంశ్ షెడ్గేల రూపంలో భారత్‌కు అద్భుతమైన ఆల్‌రౌండర్లు ఉన్నారని గావాస్కర్ గుర్తుచేశాడు.
* తొందరపడి తొక్కిపడేయకండి: వీళ్లను హడావుడిగా తుది జట్టులోకి తెచ్చి ఒక మ్యాచ్ విఫలమవ్వగానే పక్కన పెట్టకండి.. టైమ్ ఇచ్చి ప్రశాంతంగా డెవలప్ చేయండి.. ముఖ్యంగా వీరు బౌలింగ్‌ను సీరియస్‌గా తీసుకునేలా మేనేజ్‌మెంట్ గైడ్ చేస్తే భారత జట్టుకు తిరుగుండదని సన్నీ టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సజెషన్ ఇచ్చాడు.
గాయాలతో నరకం చూశా: నితీష్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున ఐపీఎల్ 2026లో 302 రన్స్, 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి 8 వికెట్లు తీసి టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిన నితీష్, ఆ తర్వాత క్వాడ్రిసెప్స్ ఇంజ్యురీ (Quadriceps Injury) వల్ల ఐర్లాండ్, ఇంగ్లాండ్, జింబాబ్వే సిరీస్‌లకు దూరమయ్యాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నెలల తరబడి రీహ్యాబ్ పూర్తి చేసుకుని ఆఖరికి ఆఫ్ఘన్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో తుది జట్టులోకి వచ్చాడు. ఇక గాయం నుంచి కోలుకుని వచ్చినప్పుడు ప్రతీ ప్లేయర్‌కు కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం.. మొదటి మ్యాచ్ సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయాను.. దేవుడు సరైన సమయంలో మన కష్టానికి ప్రతిఫలం ఇస్తాడు.. ఈ 3 వికెట్ల స్పెల్ నా కెరీర్‌కు మైలేజ్ ఇస్తుందని నితీష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా హార్దిక్ పాండ్యాకు పర్ఫెక్ట్ ప్రత్యామ్నాయంగా నితీష్ మారడంతో పాటు గవాస్కర్ చెప్పినట్లు ఇతర ఆల్‌రౌండర్లను కూడా ప్రోత్సహిస్తే భారత్ దగ్గర బెంచ్ స్ట్రెంగ్త్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లడం ఖాయం.
►ALSO READ | పాల్వంచలో ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్.. సెప్టెంబర్18 నుంచి 22 వరకు పోటీలు
