వెస్టిండీస్తో వండే, టీ20లకు హార్దిక్‌‌, పంత్కు నో ప్లేస్‌‌

వెస్టిండీస్తో వండే, టీ20లకు హార్దిక్‌‌, పంత్కు నో ప్లేస్‌‌

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌‌ల కోసం ఇండియా టీమ్‌‌ను సెలెక్టర్లు బుధవారం ప్రకటించారు. ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ పాండ్యా, రిషబ్‌‌ పంత్‌‌లకు ఈ జట్లలో చోటు దక్కలేదు. ఫిట్‌‌నెస్‌‌ నిరూపించుకోవడంలో విఫలం కావడంతో ఈ ఇద్దర్ని పక్కనబెట్టారు. పంజాబ్‌‌ యువ ఆల్‌‌రౌండర్‌‌ నమన్‌‌ ధీర్‌‌, జమ్మూ కశ్మీర్‌‌ పేసర్‌‌ అకిబ్‌‌ నబీకి తొలిసారి ఇండియా వన్డే జట్టుకు ఎంపికయ్యారు.

నమన్‌‌ డొమెస్టిక్‌‌తో పాటు ఐపీఎల్‌‌లోనూ రాణించాడు. కౌంటీ క్రికెట్‌‌లో అద్భుత ప్రదర్శన చేసిన నబీకి చాన్స్ ఇచ్చారు. అయితే ఇండియా–ఎ తరఫున 10 ఓవర్లు బౌలింగ్‌‌ చేసి ఫిట్‌‌నెస్‌‌ నిరూపించుకోవాలని హార్దిక్‌‌కు సెలెక్టర్లు సూచించారు. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్‌‌లో ఇండియా.. మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఆసియా క్రీడలకు వెళ్లే జట్టు నుంచి నితీశ్‌‌ కుమార్‌‌ రెడ్డిని వన్డే టీమ్‌‌లోకి తీసుకున్నారు. రవీంద్ర జడేజా రీ ఎంట్రీ ఇచ్చాడు. 

వన్డే జట్టు: శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (కెప్టెన్‌‌), రోహిత్‌‌ శర్మ, విరాట్‌‌ కోహ్లీ, రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌, కేఎల్‌‌ రాహుల్‌‌, ధ్రువ్‌‌ జురెల్‌‌, నితీశ్‌‌ కుమార్‌‌ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్‌‌ యాదవ్‌‌, ప్రసిధ్‌‌ కృష్ణ, గుర్నూర్‌‌ బ్రార్‌‌, సిరాజ్‌‌, అకిబ్‌‌ నబీ, యశస్వి జైస్వాల్‌‌, నమన్‌‌ ధీర్‌‌. 

టీ20 జట్టు: శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (కెప్టెన్‌‌), అభిషేక్‌‌ శర్మ, వైభవ్‌‌ సూర్యవంశీ, ఇషాన్‌‌ కిషన్‌‌, సంజూ శాంసన్‌‌, తిలక్‌‌ వర్మ, శివమ్‌‌ దూబే, కుల్దీప్‌‌ యాదవ్‌‌, అక్షర్‌‌ పటేల్‌‌, వాషింగ్టన్‌‌ సుందర్‌‌, రవి బిష్ణోయ్‌‌, నితీశ్‌‌ కుమార్‌‌ రెడ్డి, అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌, ప్రిన్స్‌‌ యాదవ్‌‌, మయాంక్‌‌ యాదవ్‌‌.