- ఎథమ్స్ బిజినెస్ స్కూల్ రెండో ఎడిషన్లో విద్యావేత్తలు
- ఏఐకు అనుగుణంగా కొత్త ఉద్యోగాలు, కెరీర్‌పై స్టూడెంట్స్‌కు అవేర్‌నెస్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని, అదే సమయంలో 9.2 కోట్ల పాత తరం ఉద్యోగాలు కనుమరుగవుతాయని ఏథమ్స్ బిజినెస్ స్కూల్ ప్రతినిధి కాళీ ప్రసాద్ గాదిరాజు తెలిపారు. బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏథమ్స్ బిజినెస్ స్కూల్‌లో ‘ఏథమ్స్ టీన్ సీఈవో ఛాలెంజ్-2026’ రెండో ఎడిషన్‌ను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మాజీ డీన్, ఏథమ్స్ స్కూల్ అడ్వైజర్ అజిత్ రంగ్నేకర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐ కారణంగా ఉద్యోగ రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో, భవిష్యత్‌లో రాబోయే కొత్త ఉద్యోగాలు, కెరీర్ అవకాశాలకు తగినట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమ వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. తొలి ఎడిషన్‌లో 30కి పైగా పాఠశాలల నుంచి 3 వేలకుపైగా విద్యార్థులు పాల్గొనగా.. వారిలో 300 మంది ఫైనల్స్‌కు చేరారు. చివరకు 12 మంది టీన్ కార్పొరేట్ లీడర్స్‌గా ఎంపికయ్యారు. కాగా, ఈ ఏడాది రెండో ఎడిషన్ తుది పోటీలు నవంబర్ 28న జరగనున్నాయి.
