వర్ధన్, కృష్ణప్రియ జంటగా ఎంజీఆర్ తుకారాం తెరకెక్కిస్తున్న చిత్రం ‘కాగితం పడవలు’. కీర్తన నరేష్, టీఆర్ ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
విశ్వక్ మాట్లాడుతూ ‘ఈ చిత్ర దర్శకుడు తుకారాం ‘ఫలక్‌నుమా దాస్’కు వర్క్ చేశాడు. అప్పటినుంచి పరిచయం. మొండి పట్టుదలతో ఈ సినిమా తీసి రిలీజ్‌కు తీసుకొచ్చాడు. ఈ సినిమాకు సపోర్ట్ చేసేందుకు నా వంతుగా మొదటి రోజు వెయ్యి టికెట్లు కొని అందరికీ పంచుతాను.
ప్యాషన్‌తో వర్క్ చేసిన ఈమూవీ టీమ్ గెలవాలి’ అని విష్ చేశాడు. విశ్వక్ సేన్ సహా సపోర్ట్ చేసిన అందరికీ దర్శకుడు తుకారం థ్యాంక్స్ చెప్పాడు. హీరోహీరోయిన్స్ వర్ధన్, కృష్ణప్రియ, నిర్మాతలు కీర్తన, అంజనప్ప, నటులు నానాజీ, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
- విశ్వక్ సేన్
