ఆరుగురు వ్యక్తుల జీవితాల్లో ఒకరోజు జరిగిన పరిణామాల నేపథ్యంలో రూపొందిన న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ డ్రామా ‘బా బా బ్లాక్ షీప్’. గుణి మంచికంటి దర్శకుడు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ మూవీ సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి లాంచ్ చేసి మూవీ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
‘‘వేవేలా ఊహలే చూపినా..”అంటూ రెట్రో స్టైల్‌లో సాగిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. ఎలక్ట్రానిక్ కిలి, ఆర్కాడో సంగీత సారథ్యంలో శ్రీ సాగర్ పాడాడు. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత వేణు దోనేపూడి చెప్పారు. టిను ఆనంద్, ఉపేంద్ర లిమాయే, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి, రాజా రవీంద్ర ఇందులో ముఖ్యపాత్రలు పోషించారు.
