ఫిబ్రవరిలో గూఢచారి సీక్వెల్ జీ 2

ఫిబ్రవరిలో గూఢచారి సీక్వెల్  జీ 2

అడివి శేష్‌‌‌‌ హీరోగా రూపొందుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ ‘జీ 2’. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.  వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న పాన్‌‌‌‌ ఇండియా వైడ్‌‌‌‌గా విడుదల చేయబోతున్నట్టు బుధవారం ప్రకటించారు.  2018లో వచ్చిన ‘గూఢచారి’ చిత్రానికి ఇది  సీక్వెల్.  వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఏజెంట్ 116గా యాక్షన్‌‌‌‌తో పాటు ఎమోషన్‌‌‌‌ వున్న క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో వామికా గబ్బి కనిపించబోతోంది.   ఇమ్రాన్ హష్మీ పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో నటిస్తుండగా మురళీ శర్మ, సుప్రియా యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.