అందుకే సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

అందుకే సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ ప్రజల ఆకాంక్షల మేరకు ఆపరేషన్ పోలో నిర్వహించారని.. ఎంతో మంది త్యాగాలు, బలిదానాలతో తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ రాష్ట్రం భారత్‌లో అంతర్భాగమైందని.. ఆనాటితో రాచరికపాలనకు ముగింపు పడిందని ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా  అన్నారు . ఆ రోజు నుంచి ప్రజాస్వామ్య పాలన మొదలైందని.. అందుకే సెప్టెంబర్17ను ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. 

2026 సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మాట్లాడిన సీఎం.. ప్రజా పాలన అంటే ప్రజల మాటకు విలువ ఇవ్వడం.. ప్రభుత్వ వనరులను అందరికీ చేరేలా చూడటమేనని అన్నారు.  

తెలంగాణలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు సీఎం. భూభారతీ చట్టంలో సంస్కరణలు తెచ్చినట్లు తెలిపారు. కృష్ణా జాలలపై పోరాడుతున్నామన్నారు. అదేవిధంగా కృష్నా, గోదావరి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. 

మహిళా సంఘాలకు బస్సులు ఇచ్చి బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. తెలంగాణ విద్యా వ్వవస్థ రూపు మార్చేందుకు యంగ్ ఇండియా స్కూళ్లనుఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

ప్రభుత్వ స్కూళ్లలో మిడ్ డే మీల్స్, బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 72 వేల ఉద్యోగాలను భర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఐఐటీలను ఏటీసీలుగా మార్చినట్లు తెలిపారు. 2047 లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తామన్నారు.