తాడ్వాయి/ ఖిలా వరంగల్(మామునూరు)/ వెంకటాపూర్(రామప్ప), వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు పర్యటించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క, సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. పూనమ్ అలువాలియా, అపూర్వ శేన్వి, వెంకటరావు, నిత్య, నేహా ప్రకాశ్తదితరులు అమ్మవార్ల గద్దెల వద్ద గిరిజన సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎండోమెంట్ అధికారులు, పూజారులు వారికి శాలువాలతో సత్కరించి ప్రసాదం అందజేశారు. అనంతరం మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను తెలుసుకుని, లక్నవరం సరస్సును సందర్శించారు. ఆ తర్వాత వారు వరంగల్‌లోని ప్రసిద్ధ ఓరుగల్లు కోటను సందర్శించారు. కోట విశిష్టతలను తెలంగాణ పర్యాటక శాఖ గైడ్ దేనబోయిన రవి యాదవ్ వారికి వివరించారు. రామప్ప ఆలయాన్ని సందర్శించిన వరల్డ్‌బ్యాంక్ ప్రతినిధులు స్వామివారికి పూజలు చేసి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రసాద్, పాస్కి స్కీంలలో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకున్నారు.
