అక్టోబర్ 1న కృష్ణా బోర్డు మీటింగ్

అక్టోబర్ 1న కృష్ణా బోర్డు మీటింగ్

హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాల పంపిణీపై కృష్ణా బోర్డు సమావేశం నిర్వహించనుంది. అక్టోబర్ 1న 21వ బోర్డు మీటింగ్​ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల అధికారులకు బోర్డు బుధవారం సమాచారం అందించింది. ఈ మీటింగులో నీటి వాటాలతో పాటు వివిధ ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. ఎల్​నినో నేపథ్యంలో ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీటిని కేవలం తాగునీటికే వాడుకోవాలని ఇప్పటికే బోర్డు స్పష్టం చేసింది.

ఈ నెల 4న త్రీమెంబర్​ కమిటీ మీటింగ్​లో 50:50 నిష్పత్తిలో నీళ్లను పంచాలని మన రాష్ట్రం డిమాండ్​ చేయగా.. ఏపీ ఎప్పటిలాగానే 66:34 రేషియోలో పంచాలని పాత పాటే పాడింది. మనకు 200 టీఎంసీలు అడగ్గా.. ఏపీ 104 టీఎంసీలు కావాలని అడిగింది.దీంతో చర్చలు ఎటూ తేలకపోవడంతో బోర్డు మళ్లీ మీటింగ్​ను నిర్వహించాలని
 నిర్ణయించింది.