ధరణిలో ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ బయటపెట్టాలి : బీజేఎల్పీ నేత ఏలేటి

ధరణిలో ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ బయటపెట్టాలి : బీజేఎల్పీ నేత ఏలేటి

హైదరాబాద్, వెలుగు: ధరణిపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫోరెనిక్స్ ఆడిట్ రిపోర్ట్ ను బయటపెట్టాలని, అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీలో 22ఏ పై జరిగిన చర్చలో ఆయన  మాట్లాడారు. 22ఏ, ధరణిలో లక్షల ఎకరాలు బదిలీ అయ్యాయని ఆరోపించారు. పారిశ్రామిక భూమి ని కన్వర్ట్ ఎలా చేస్తారు? రెసిడెన్షియల్ భవనం ఎలా కడతారని ప్రశ్నించారు. ముందుగా రిజిస్ట్రేషన్ రిజెక్ట్ చేసి భూమి.. మంత్రిగా ఉన్న వ్యక్తికి చెందిన కంపెనీ ఎంటర్ కాగానే ఎలా రిజిస్టర్ అవుతుందన్నారు. 22ఏ అవకతవకలపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ధరణితోనే  బీఆర్ ఎస్ ఓడింది: ఎమ్మెల్యే కూనంనేని

ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ..22ఏ పేరుతో కోటి ఎకరాలను నిషేదిత జాబితాలో చేర్చారన్నారు. బీఆర్ ఎస్ ఓడిపోవటానికి ధరణి, 22ఏ కారణమన్నారు. బీఆర్​ఎస్​ నేతలు చేసిన తప్పులతో ఈ ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారన్నారు. గత సీఎస్ సోమేశ్ కుమార్ వల్లే అక్రమాలు జరిగాయన్నారు.