వడ్డీ రేట్ల పెంపుతో బంగారం తగ్గింది.. గోల్డ్ రేట్లు ఇంకా పడిపోతాయా..? హైదరాబాద్ రేట్లివే

వడ్డీ రేట్ల పెంపుతో బంగారం తగ్గింది.. గోల్డ్ రేట్లు ఇంకా పడిపోతాయా..? హైదరాబాద్ రేట్లివే

అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తాజాగా వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. రోజురోజుకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఇన్వెస్టర్లు వడ్డీ ఆదాయం వచ్చే బాండ్ మార్కెట్ల వైపు తమ డబ్బును స్టాక్ మార్కెట్లు, బులియన్ మార్కెట్ల నుంచి తరలిస్తున్నారు. ఒకపక్క రూపాయి మారకపు విలువ కూడా డాలర్ తో పోల్చితే ఆవిరైపోతుంటే భారత్ లాంటి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం వేస్ట్ అని భావిస్తున్న ఫారెన్ ఇన్వెస్టర్లు ఆ డబ్బును అటు బాండ్స్ లేదంటే క్రిప్టోల్లోకి తరలిస్తూ సంక్షోభం నుంచి సంపదను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో బంగారం రేట్లు తగ్గుదలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు షాపింగ్ చేయాలని భావిస్తున్నారు. 

సెప్టెంబర్ 17న బంగారం రేట్లు తగ్గాయి. సెప్టెంబర్ 16 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.60 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 284గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 010గా కొనసాగుతోంది. 

గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 17, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 50వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.250 దగ్గర ఉంది.