న్యూఢిల్లీ: కారు, ఆటో, బైక్ బుక్ కాకముందే డ్రైవర్‌కు టిప్ ఇచ్చే ఆప్షన్లు చూపెట్టడం ఆపేయాలని ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి కాబ్ అగ్రిగేటర్లను కేంద్రం ఆదేశించింది. ఈ పద్ధతి మోసపూరితమని, వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే బుధవారం స్పష్టం చేశారు. ర్యాపిడో సంస్థ అనైతిక వ్యాపార పద్ధతులకు పాల్పడినందుకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్అథారిటీ రూ. 10 లక్షల జరిమానా విధించింది. ఉబర్, ఓలా సంస్థల వ్యాపార విధానాలపై కూడా సమగ్ర విచారణ కొనసాగుతోంది. ముందస్తు టిప్‌పై జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు భారీగా ఫిర్యాదులు అందాయి. దీంతో కేంద్రం ఈ ప్రకటన చేసింది.
