ప్రభుత్వం ప్రతిదానికీ సబ్సిడీ ఇవ్వలేదు: నీతి ఆయోగ్ వీసీ అశోక్

ప్రభుత్వం ప్రతిదానికీ సబ్సిడీ ఇవ్వలేదు: నీతి ఆయోగ్ వీసీ అశోక్

న్యూఢిల్లీ: యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలను ప్రవేశపెట్టాలన్న కేంద్రం నిర్ణయాన్ని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ లాహిరి సమర్థించారు. ప్రభుత్వం ప్రతిదానికీ సబ్సిడీ ఇవ్వలేదని..వ్యాపారాలు ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడకుండా, తమంతట తాముగా నిలదొక్కుకునే మార్గాలను వెతుక్కోవాలని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పువ్వు నుంచి తేనెటీగ సున్నితంగా తేనెను ఎలా సేకరిస్తుందో, అలాగే.. పాలకుడు కూడా పౌరుల నుంచి నొప్పి కలగకుండా పన్నులు సేకరించాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే. యూపీఐ లావాదేవీలపై ఛార్జీల వల్ల సామాన్యులపై పడే ప్రభావం చాలా తక్కువ’ అని అన్నారు.