నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: మహాత్మాగాంధీ లిఫ్ట్ స్కీం ద్వారా సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. బుధవారం నాగర్ కర్నూల్ మండలం మల్కాపూర్, వెంకటాపూర్, తాడూరు మండలం గుంతకోడూరు గ్రామాల రైతులు జిల్లాకేంద్రంలోని ఇరిగేషన్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీరు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. సాగునీటి కోసం అధికారులను వేడుకున్నా స్పందించడం లేదని, వెంటనే డీ26 సాగునీటి కాల్వకు నీటిని విడుదల చేసి పంటను కాపాడాలని కోరారు.
