వనపర్తి: ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరి అరెస్ట్

వనపర్తి: ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరి అరెస్ట్

వనపర్తి, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఇద్దరిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. వనపర్తి జిల్లా గోపాల్‌‌‌‌‌‌‌‌పేట్ ఎస్‌‌‌‌‌‌‌‌ఐ ఎస్సై శశిధర్​వివరాల ప్రకారం.. గోపాల్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌లోని గర్ల్స్‌‌‌‌‌‌‌‌ హైస్కూల్‌‌‌‌‌‌‌‌, పొల్కే పహాడ్​ హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెన్నూరు గ్రామానికి చెందిన బోయ కృష్ణవేణి, పొల్కే పహాడ్​  గ్రామానికి చెందిన బొగ్గు మంజుల నుంచి రూ. 50వేల చొప్పున రూ.లక్ష వసూలు చేశారు. 

ఈ ఘటనలో పెద్దమారూరుకు చెందిన వంగూరు రవిప్రసాద్‌‌‌‌‌‌‌‌, ఖిల్లాగణపురం మండలం మానాజీపేటకు చెందిన తొగట హనుమాన్‌‌‌‌‌‌‌‌ దాస్‌‌‌‌‌‌‌‌ కేంద్ర విద్యాశాఖకు చెందిన విద్యాంజలి లెటర్ ప్యాడ్‌‌‌‌‌‌‌‌పై నియామక ఉత్తర్వులు ఇస్తూ మెయిల్ పంపారు. ఉద్యోగంలో చేరి ఐదు నెలలైనా జీతాలు రాకపోవడంతో బాధితులు నిలదీయగా రవిప్రసాద్‌‌‌‌‌‌‌‌, హనుమాన్‌‌‌‌‌‌‌‌దాస్‌‌‌‌‌‌‌‌ పొంతన లేని సమాధానాలు చెబుతూ దాటవేశారు. వారి ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా మోసం చేసినట్లు ఒప్పుకున్నారు. వారిని వనపర్తిలోని రెండో అడిషనల్​జ్యుడీషియల్​ఫస్ట్​క్లాస్​మెజిస్ట్రేట్​కోర్టులో హాజరు పరచి రిమాండుకు తరలించినట్లు ఎస్సై వివరించారు.