దిశ ఎవరో నాకు తెలియదు..శివసేన (యూపీబీ )నేత ఆదిత్య థాక్రే

దిశ ఎవరో నాకు తెలియదు..శివసేన (యూపీబీ )నేత ఆదిత్య థాక్రే

ముంబై: దిశ సాలియన్ అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌లో తన పేరు చేర్చడంపై శివసేన (యూబీటీ) నేత, వర్లీ ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే తీవ్రంగా స్పందించారు. దిశ సాలియన్ ఎవరో కూడా తనకు తెలియదని, ఆమెను ఎన్నడూ కలవలేదని స్పష్టం చేశారు. రాజకీయ, వ్యక్తిగత లబ్ధి కోసమే కొందరు కావాలనే ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈమేరకు ఎక్స్ వేదికగా స్పందించిన ఆదిత్య థాక్రే.. అవాస్తవాలను పక్కన పెట్టి వాస్తవాలు మాట్లాడుకుందామంటూ పోస్ట్ చేశారు. ఆధారాలు లేకుండా కొందరు తనపై బురదజల్లుతున్నారని ఆరోపించారు. టీవీ డిబేట్లు, మీడియా ట్రయల్స్ వాస్తవాలను మార్చలేవని పేర్కొన్నారు. దర్యాప్తును నిష్పక్షపాతంగా జరగనివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఏమిటి ఈ దిశ సాలియన్ కేసు?

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌‌‌‌పుత్‌‌‌‌కు మేనేజర్‌‌‌‌గా పనిచేసిన దిశ సాలియన్.. 2020 జూన్ 8న ముంబైలోని ఓ బిల్డింగ్​ పైనుంచి పడి మృతి చెందారు. ఆ తర్వాత కొద్దిరోజులకే జూన్ 14న సుశాంత్ సింగ్ కూడా మరణించాడు. దీంతో ఈ కేసుల మధ్య సంబంధం ఉందని ఊహాగానాలు చెలరేగాయి.