పాలమూరు యూనివర్సిటీలో ఆడిటోరియం నిర్మాణానికి రూ. కోటి మంజూరు

పాలమూరు యూనివర్సిటీలో ఆడిటోరియం నిర్మాణానికి రూ. కోటి  మంజూరు

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో ఆడిటోరియం నిర్మాణానికి ఎంఎస్ఎన్ అధినేత డాక్టర్​మన్నె సత్యనారాయణరెడ్డి  తొలి విడతగా రూ.కోటి మంజూరు చేసినట్లు వీసీ జీఎన్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్ , రిజిస్ట్రార్ రమేశ్‌‌‌‌‌‌‌‌బాబు తెలిపారు. ఇటీవల జరిగిన యూనివర్సిటీ కాన్వొకేషన్‌‌‌‌‌‌‌‌లో సత్యనారాయణరెడ్డి  ఆడిటోరియం నిర్మాణానికి రూ.10 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. 

ఇందులో భాగంగా తొలి విడతగా బుధవారం రూ.కోటి మంజూరు చేశారు. వీసీ  మాట్లాడుతూ యూనివర్సిటీలో నిర్మించనున్న ఆడిటోరియం జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా నిలిచేలా రూపుదిద్దుకోనుందన్నారు. ఈ సందర్భంగా మన్నె సత్యనారాయణరెడ్డికి యూనివర్సిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.