కోల్బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కల్యాణి ఖని -5 బొగ్గు గనిలో ఎయిర్ బ్లాస్ట్ కావడంతో ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో గనిలోని 1 డిప్, మూడో సీము, 16వ లెవల్లో ఎక్స్ ప్లోజివ్స్ పెట్టేందుకు బొగ్గు పొరకు రంధ్రాలు చేసేందుకు కోల్కట్టర్ రాజశేఖర్, జనరల్ అసిస్టెంట్లు రామిల్ల తిరుపతి, ఆవునూరి శశికుమార్ సిద్ధమయ్యారు.
ఇదే సమయంలో వారి సమీపంలో ఒక్కసారిగా భారీ ఎయిర్బ్లాస్ట్(రూఫ్ఫాల్) కావడంతో ముగ్గురూ గాయపడ్డారు. గమనించిన తోటి కార్మికులు గాయపడిన వారిని రామకృష్ణాపూర్సింగరేణి ఏరియా హాస్పిటల్ కు తరలించారు.
గాయపడిన కార్మికులను మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ, సింగరేణి కాలరీస్ వర్కర్స్యూనియన్(ఏఐటీయూసీ) స్టేట్ ప్రెసిడెంట్వాసిరెడ్డి సీతారామయ్య, సెంట్రల్వైస్ ప్రెసిడెంట్ఎండి.అక్బర్అలీ, సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, ఇప్పకాయల లింగయ్య, సంపత్, సీఐటీయూ ప్రెసిడెంట్ఎస్.వెంకటస్వామి, టీబీజీకేఎస్ లీడర్మేడిపల్లి సంపత్ పరామర్శించారు.
