భద్రాచలం దేవస్థానం భూముల్లో ఆక్రమణల తొలగింపు.. ఎటపాక మండలంలో 900 ఎకరాలు ఖాళీ చేయాలి

భద్రాచలం  దేవస్థానం భూముల్లో ఆక్రమణల తొలగింపు.. ఎటపాక మండలంలో 900 ఎకరాలు ఖాళీ చేయాలి

భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన భూముల్లో ఆక్రమణలను బుధవారం ఆఫీసర్లు తొలగించారు. భద్రాచలం రామయ్యకు విలీన ఆంధ్రా ఏటపాక మండలం పురుషోత్తపట్నంలో దేవస్థానానికి ఉన్న సుమారు 900 ఎకరాల భూముల్లో కొంతకాలంగా ఆక్రమణలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. 

ఈ నేపథ్యంలో ఈవో దామోదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి జేసీబీలతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. దీంతో ఆక్రమణదారులు దేవస్థానం సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న ఏటపాక పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 

దేవస్థానం భూములను ఎవరూ ఆక్రమించినా ఉపేక్షించేది లేదని ఈవో స్పష్టం చేశారు. ఇప్పటికే కోర్టు తీర్పులు దేవస్థానానికి అనుకూలంగా ఉన్నాయని పేర్కొంటూ, భూములను ఖాళీ చేసి వెళ్లాలని ఆక్రమణదారులను కోరారు. దేవస్థానం భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.