పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీనివాస కాలనీ మినీ స్టేడియం ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్‌కు వేదికగా నిలవనుంది. శుక్రవారం నుంచి ఈ నెల 22 వరకు జరిగే పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 55 నుంచి 75 ఏండ్ల సీనియర్ క్రీడాకారులు పాల్గొననున్నారు. శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ చైర్మన్ నల్ల సురేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు టెన్నిస్ అకాడమీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
పాల్వంచ మినీ స్టేడియంతో పాటు కొత్తగూడెం కేటీపీఎస్ ఇండోర్ స్టేడియంలోనూ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. విజేతలకు ఈ నెల 22న బహుమతులు అందజేయనున్నారు. ఇప్పటికే క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయని జిల్లా టెన్నిస్ అకాడమీ అధ్యక్షులు గంగిరెడ్డి యుగంధర్ రెడ్డి, వై.వెంకటేశ్వర్లు తెలిపారు.
