- చెల్లి ఆచూకీ గల్లంతు
నవీపేట్, వెలుగు : వాగులో దూకిన చెల్లిని కాపాడుదామని అన్న సైతం నీటిలో దూకాడు. ఈత రాకపోవడంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఇందులో అన్న చనిపోగా.. చెల్లి ఆచూకీ దొరకలేదు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం జన్నేపల్లిలో బుధవారం రాత్రి జరిగింది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం...
జన్నేపల్లి గ్రామానికి చెందిన అల్లె గంగాధర్ కుమారుడు గణేశ్ (28) హైదరాబాద్ లో జాబ్ చేస్తూ బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో ఇంటి వద్ద కుటుంబ సభ్యులు గొడవ పడడంతో మనస్తాపానికి గురైన గంగాధర్ కూతురు లయ (23) సూసైడ్ చేసుకుంటానంటూ వెళ్లి వాగులో దూకింది.
ఆమె వెంటే వెళ్లిన గణేశ్ సైతం చెల్లిని కాపాడేందుకు నీటిలో దూకాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనాస్థలానికి చేరుకొని నీటిలో గాలింపు చేపట్టగా.. గణేశ్ డెడ్ బాడీ దొరికింది. రాత్రి కావడంతో గాలింపు ఆపేయగా.. లయ ఆచూకీ దొరకలేదు.
